తదుపరి తరం డిజిటల్ గోప్యత, కంప్లయన్స్, విశ్వాసం. భారత్ తదుపరి ముందడుగు.
Airavata భారతదేశ డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం కోసం మొదటి నుంచీ నిర్మించిన డేటా పరిరక్షణ ప్లాట్‌ఫామ్. ఎక్కడి నుంచో తెచ్చి సర్దినది కాదు. అనువదించినది కాదు. ఈ చట్టం కోసమే, అది రక్షించే ప్రతి భారతీయుడి కోసమే నిర్మించినది.
భారత్ 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపునిచ్చింది. చెల్లింపుల్లో కొత్త మార్గాన్ని ప్రపంచానికి నేర్పింది. అధికారిక పత్రాలను ప్రతి ఒక్కరి జేబులోకి తెచ్చింది.
ఆ తర్వాత, వీటన్నిటి వెనుక మిగిలే మన వ్యక్తిగత డేటాను కాపాడేందుకు ఒక చట్టం తెచ్చింది.
ఇంత దూరదృష్టి గల చట్టానికి, దాని కోసమే నిర్మించిన ప్లాట్‌ఫామ్ కావాలి. వేరే దేశం నుంచి అరువు తెచ్చుకున్నది కాదు. పాత ఉత్పత్తికి అతికించినది కాదు. ఇక్కడే, ఇక్కడి కోసమే, మొట్టమొదటి కోడ్ లైన్ నుంచీ నిర్మించినది.
ఆ ప్లాట్‌ఫామ్ దాదాపు సిద్ధమైంది. దాని పేరు Airavata.
Airavata అనే పేరు ఎందుకు
భారతీయ సంప్రదాయంలో ఐరావతం క్షీరసాగర మథనంలో ఉద్భవించిన శ్వేత గజం. దేవతల రాజైన ఇంద్రుడి వాహనం అదే. తూర్పు దిక్కుకు కాపలాగా నిలిచేదీ అదే. లోకంలోని దిక్కులను మోస్తూ కాపాడే అష్టదిగ్గజాల్లో ఐరావతం ఒకటి.
మథనంలో ఉద్భవించిన సంరక్షకుడు. స్థిరం, సదా అప్రమత్తం, అచంచలం.
మా ప్లాట్‌ఫామ్‌కు ఆ పేరు పెట్టడానికి కారణం ఒక్కటే. కాపాడటమే దాని పని. అదే సర్వస్వం.
13 మే 2027.
ఆ రోజు నుంచి, భారతదేశంలోని ప్రజల డిజిటల్ వ్యక్తిగత డేటాను నిర్వహించే ప్రతి సంస్థకూ భారత డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల్లోని ప్రధాన నిబంధనలు వర్తిస్తాయి.
ప్రతి సంస్థ నుంచి చట్టం ఏం కోరుతోంది
- १
వ్యక్తిగత డేటాను సేకరించే ముందు, సరళమైన భాషలో స్పష్టమైన నోటీసు.
§ 5 - २
స్వేచ్ఛగా, నిర్దిష్టంగా, పూర్తి అవగాహనతో ఇచ్చిన సమ్మతి. ఇచ్చినంత సులువుగానే దాన్ని ఉపసంహరించుకునే వీలు.
§ 6 - ३
ప్రతి రికార్డుకూ సహేతుకమైన భద్రత.
§ 8(5) - ४
బ్రీచ్ జరిగితే డేటా పరిరక్షణ బోర్డుకు, ప్రభావితులైన ప్రతి వ్యక్తికీ తెలియజేయడం.
§ 8(6) - ५
ప్రయోజనం నెరవేరిన తర్వాత డేటా తొలగింపు.
§ 8(7) - ६
పిల్లల లేదా వైకల్యం ఉన్న వ్యక్తుల డేటాను ప్రాసెస్ చేసే ముందు, తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకుల నుంచి ధ్రువీకరించదగిన సమ్మతి.
§ 9 - ७
ప్రజలు ఫిర్యాదు చేసి, సమాధానం పొందడానికి నిజమైన మార్గం.
§ 8(10) · 13
తప్పు చేస్తే మూల్యం ఎంత
చట్టం సిద్ధమైంది. గడియారం నడుస్తోంది. ఇప్పుడు ప్రశ్న పాటించాలా వద్దా అన్నది కాదు, ఎంత బాగా పాటిస్తారన్నదే.
వ్యక్తిగత డేటాను కాపాడడంలో విఫలమైతే
గరిష్ఠంగా₹250 కోట్లు
బ్రీచ్ గురించి తెలియజేయడంలో విఫలమైతే
గరిష్ఠంగా₹200 కోట్లు
పిల్లల పట్ల బాధ్యతలు నెరవేర్చకపోతే
గరిష్ఠంగా₹200 కోట్లు
విదేశీ ఉత్పత్తికి భారత జెండా తగిలించినది కాదు.
చాలావరకు గోప్యత సాఫ్ట్‌వేర్‌ను యూరప్ కోసమో, కాలిఫోర్నియా కోసమో రాసి, ఆ తర్వాత భారత్‌కు సర్దారు. అనువదించిన మెనూలు. అరువు తెచ్చుకున్న నిర్వచనాలు. ప్రజలు ఎలా జీవిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా సమ్మతి ఇస్తారు అనే విషయాలపై విదేశీ అంచనాలు.
Airavata దీనికి భిన్నమైన దారిలో నడిచింది. మేం DPDP చట్టం, దాని నియమాల పాఠం నుంచి మొదలుపెట్టి, సెక్షన్ వారీగా అంచెలంచెలుగా నిర్మించాం. ప్రతి ఫ్లో, ప్రతి స్క్రీన్, ప్రతి రికార్డు ముందుగా భారత చట్టంలోని ఒక బాధ్యతకు జవాబుదారీ.
ఇది చట్టం సొంత భాషే మాట్లాడుతుంది: డేటా ప్రిన్సిపల్‌లు, డేటా ఫిడ్యూషియరీలు, డేటా పరిరక్షణ బోర్డు. దేన్నీ తర్వాత అతికించలేదు. అనువాదంలో ఏదీ చేజారలేదు.
डिजिटल वैयक्तिक डेटा संरक्षण अधिनियम, 2023
DPDP · 2023
- § 1
- § 2
- § 3
- § 4
- § 5
- § 6
- § 7
- § 8
- § 9
- § 10
- § 11
- § 12
- § 13
- § 14
- § 15
- § 16
- § 17
- § 18
ఒకే చట్టం. ఆద్యంతం చదివాం. వాక్యం వాక్యంగా నిర్మించాం.
140 కోట్ల మందికీ గోప్యత. చిన్న అక్షరాల నిబంధనలు చదివేవారికి మాత్రమే కాదు.
తమ గురించి ఏ సమాచారం ఉందో తెలుసుకునే, దాన్ని సరిదిద్దించుకునే, తొలగించమని కోరే, ఫిర్యాదు చేసే హక్కును, తాము స్వయంగా వ్యవహరించలేని పరిస్థితి వస్తే తమ తరఫున పనిచేసేందుకు ఒకరిని నామినేట్ చేసే హక్కును ఈ చట్టం భారత్‌లోని ప్రతి వ్యక్తికీ ఇస్తుంది. ఒక హక్కును మనిషి నిజంగా ఉపయోగించుకోగలిగినప్పుడే దానికి విలువ. అందుకే Airavataను యావత్ భారత్ కోసం రూపొందిస్తున్నాం:
- १జిల్లా పట్టణంలో మొదటిసారి స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వ్యక్తి.
- २ఆన్‌లైన్‌లో ఎప్పుడూ ఒక్క ఫారం కూడా నింపని తాతయ్య, నానమ్మ.
- ३తమ సొంత భాషలో, సొంత లిపిలో చదివితేనే సులువుగా అర్థమయ్యే వ్యక్తి.
- ४వైకల్యం ఉన్న వ్యక్తి, వారి తరఫున వ్యవహరించే సంరక్షకులు.
- ५పిల్లలు, వారి తరఫున నిర్ణయం తీసుకోమని చట్టం కోరే తల్లిదండ్రులు.
- ६పది సెకన్లలో పని పూర్తి కావాలనుకునే బిజీ ప్రొఫెషనల్.
- ७వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన, ప్రతి సంస్థలోని అధికారి.
వ్యక్తిగత డేటాను సేకరించే ముందు, సరళమైన భాషలో స్పష్టమైన నోటీసు.
భారతీయ భాషలు, అందరికీ అందుబాటు అనేవి Airavata పునాదిలోనే ఉన్నాయి, తర్వాత వచ్చే అప్‌డేట్‌లో కాదు.
వీరందరికీ పనిచేయకపోతే, అది ఇంకా పూర్తి కానట్టే.
భారత్ ఇప్పటికే నమ్ముతున్న పట్టాలపై నిర్మితం.
ప్రపంచంలోనే అత్యంత దూరదృష్టి గల డిజిటల్ ప్రజా మౌలిక వ్యవస్థను భారత్ నిర్మించింది: వంద కోట్ల మందికి పైగా గుర్తింపు, జేబులోనే అధికారిక పత్రాలు, క్షణంలో చెల్లింపులు.
Airavata ఆ మౌలిక వ్యవస్థను పక్కనపెట్టి కాకుండా, దానితో కలిసి పనిచేసేలా రూపొందుతోంది. ఒక వ్యక్తి తాను ఎవరో, లేదా ఒక సంస్థ తానేమిటో రుజువు చేసుకున్నప్పుడు, అది భారతీయులకు ఇప్పటికే తెలిసిన, వారు నమ్మే పట్టాలపైనే జరుగుతుంది.
మేరీ పెహచాన్ సింగిల్ సైన్-ఆన్ (డిజిలాకర్)కు ఆమోదం లభించింది. NeGD, MeitYతో ఆన్‌బోర్డింగ్ పూర్తయింది.
భారత్‌లోనే హోస్టింగ్.
కాగితం మీద కల కాదు.
Airavata నిర్మాణం పూర్తయింది. అది పనిచేస్తోంది. ఇప్పుడు చివరి దశ పరీక్షల్లో ఉంది.
- १
ప్రొడక్షన్‌లో నిరూపితం
నిజమైన వ్యక్తిగత డేటాపై.
- २
ఆద్యంతం పరీక్షించాం
5 ప్రధాన డేటాబేస్ కుటుంబాలు, 7 SaaS ప్లాట్‌ఫామ్‌లపై.
- ३
దాడి చేసే కోణం నుంచి భద్రతా సమీక్ష
ప్రతి పొరపైనా, ఒక్కో స్టాక్ చొప్పున.
- ४
500కి పైగా పేజీలు
భారత చట్టం కోసం రాసిన న్యాయపరమైన పునాది కసరత్తు.
- ५
రెండు ఆవిష్కరణలు
పేటెంట్ పెండింగ్‌లో.
- నిర్మితం
- నిరూపితం
- పటిష్ఠం
- చివరి పరీక్షలుఇప్పుడు
- ముందస్తు యాక్సెస్తదుపరి
- విడుదల
మేం మీకు ఇంకా చెప్పనిది.
100కి పైగా భారతీయ, అంతర్జాతీయ గోప్యత, సమ్మతి ఉత్పత్తులను అధ్యయనం చేశాం. Airavataలా నిర్మించినది ఒక్కటి కూడా కనిపించలేదు.
అందుకే, ప్రస్తుతానికి వివరాలను మాలోనే ఉంచుకుంటున్నాం.
గోప్యత విషయంలో ఇప్పటివరకు ఎవరూ బహిరంగంగా నిలబెట్టుకోలేకపోయిన ఆ ఒక్క వాగ్దానం.
చట్టం రాసిన రోజు కోసం కాదు, అది పరీక్షకు నిలిచే రోజు కోసం నిర్మితం.
నియంత్రణ సంస్థ నుంచి పిలుపు వచ్చినప్పుడు,
తమ డేటాను నమ్మి మీకు అప్పగించిన వ్యక్తి చేతిలో ఉండాల్సినది.
విడుదల రోజున వెల్లడిస్తాం.
ఒకరి జీవితంలోని ఒక భాగాన్ని తమ దగ్గర ఉంచుకునే ప్రతి సంస్థ కోసం.
భారత్‌లోని ప్రజల నుంచి మీరు పేరు, ఫోన్ నంబర్, ఆరోగ్య రికార్డు, పరీక్ష మార్కులు లేదా కొనుగోళ్ల చరిత్ర సేకరిస్తే, DPDP చట్టం మీకు వర్తిస్తుంది. పది రికార్డులైనా, పది కోట్లైనా, చట్టం కోరే జాగ్రత్త ఒక్కటే.
ఇద్దరు వ్యక్తుల స్టార్టప్ నుంచి జాతీయ సంస్థ వరకు, అందరి కోసం Airavata రూపుదిద్దుకుంటోంది.
- ०१ప్రజా సేవలు
- ०२బ్యాంకింగ్, ఆర్థిక రంగం
- ०३ఆరోగ్య సంరక్షణ
- ०४విద్య
- ०५వాణిజ్యం
- ०६టెక్నాలజీ
మాకు మేం పెట్టుకున్న ప్రమాణాలు.
ముందు భారత్.
అన్నిటికంటే ముందు భారత చట్టం, భారతీయ భాషలు, భారతీయుల జీవితాల కోసం నిర్మితం.
చట్టపరమైన గందరగోళం కాదు, సరళమైన భాష.
ఒక వ్యక్తికి అర్థం కాకపోతే, అది వివరించినట్టు కాదు.
హామీల కంటే రుజువులు.
చూపించలేనిదేదీ మేం చెప్పుకోం.
భారత్‌లోనే హోస్టింగ్.
భారతీయుల డేటా, భారత గడ్డపైనే.
అదే చట్టం, మాకూ వర్తిస్తుంది.
మేం ఏ చట్టం కోసం నిర్మిస్తున్నామో, దాన్నే మేమూ పాటిస్తాం.
అందరికంటే ముందు మీరే.
ముందస్తు యాక్సెస్ మొదట కొన్ని సంస్థలకు మాత్రమే అందుతుంది. మీ వివరాలు ఇవ్వండి. ఇంకెవరికీ తెలియక ముందే మేం మిమ్మల్ని సంప్రదిస్తాం.
మీ ప్రశ్నలకు సమాధానాలు.
Airavata ఎప్పుడు విడుదలవుతుంది?
త్వరలోనే. Airavata చివరి దశ పరీక్షల్లో ఉంది. ముందస్తు యాక్సెస్ జాబితాలోని సంస్థలకు అందరికంటే ముందు తెలుస్తుంది.
Airavata ఎవరి కోసం?
ఇద్దరు వ్యక్తుల స్టార్టప్ నుంచి జాతీయ సంస్థ వరకు, భారత్‌లోని ప్రజల డిజిటల్ వ్యక్తిగత డేటాను నిర్వహించే ఏ సంస్థ కోసమైనా.
మాది చిన్న కంపెనీ. చట్టం మాకూ వర్తిస్తుందా?
మీ సంస్థ పరిమాణం ఏదైనా, చాలా బాధ్యతలు వర్తిస్తాయి. ఐదుగురు సభ్యుల కంప్లయన్స్ విభాగం అవసరం లేకుండానే, ఐదుగురు ఉన్న బృందం కూడా వాటిని నెరవేర్చగలిగేలా Airavata రూపుదిద్దుకుంటోంది.
Airavata ఇతర దేశాల చట్టాల కోసం కూడా నిర్మితమైందా?
Airavata ముందుగా భారత చట్టం కోసం నిర్మితమైంది. అది మా ఎంపిక, పరిమితి కాదు.
మా డేటా ఎక్కడ హోస్ట్ అవుతుంది?
భారత్‌లోనే.
ఏయే భాషలకు మద్దతు ఉంటుంది?
భారత్ మాట్లాడే భాషల కోసం Airavata రూపుదిద్దుకుంటోంది. పూర్తి జాబితా విడుదల సమయంలో వెల్లడవుతుంది.
వైకల్యం ఉన్నవారికి ఇది అందుబాటులో ఉంటుందా?
అందరికీ అందుబాటు అనేది Airavata పునాదిలోనే భాగం, తర్వాత వచ్చే అప్‌డేట్ కాదు. చట్టం భారత్‌లోని ప్రతి వ్యక్తినీ రక్షిస్తుంది. ఉత్పత్తి కూడా అలాగే ఉండాలి.
దీని ధర ఎంత?
ధరలను విడుదల సమయంలో ప్రకటిస్తాం. ముందస్తు యాక్సెస్ జాబితాలోని సంస్థలకు ముందుగా తెలుస్తుంది.
మీ ఆవిష్కరణలు ఏమిటి?
మా పని అడుగున పేటెంట్ పెండింగ్‌లో ఉన్న రెండు ఆవిష్కరణలు ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయనేది ప్రస్తుతానికి పేటెంట్ దరఖాస్తుల్లోనే ఉంటుంది.
Airavataను ఎవరు నిర్మిస్తున్నారు?
AXIOMAERA Private Limited. మహారాష్ట్రకు చెందిన ఈ డీప్-టెక్నాలజీ సంస్థ BITS Pilani (PIEDS)లో ఇంక్యుబేట్ అయింది.